Kodali Nani: కొడాలి నానిపై చర్యలు తీసుకోండి: గవర్నర్ ను కోరిన నిమ్మగడ్డ రమేశ్

SEC Nimmagadda Ramesh requests Governor to take action on Kodali Nani
  • అసభ్య పదజాలంతో దూషించారు
  • ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు
  • ఈసీపై ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతున్న నేపథ్యంలో, నిమ్మగడ్డను వైసీపీ నేతలు మరోసారి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. ఈ లేఖలో కొడాలి నానిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. లేఖతో పాటు.... ఈసీని ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, వీడియో క్లిప్పింగులను కూడా గవర్నర్ కు పంపారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News