ట్రక్కులో వెళుతున్న నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

19-11-2020 Thu 12:30
  • శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నం
  • నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఘటన
  • ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌‌కు తీవ్రగాయాలు
four terrorists gunned down

జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ట్రక్కులో ఉన్న ఉగ్రవాదులను గుర్తించిన భారత భద్రతా బలగాలు వారిని హతమార్చాయని అక్కడి పోలీసులు తెలిపారు.

శ్రీనగర్‌ వైపు వెళ్తున్న ట్రక్కును తనిఖీ నిమిత్తం భద్రతా సిబ్బంది ఆపడానికి ప్రయత్నించారు. దీంతో అందులోని ఉగ్రవాదులు ఆటోమెటిక్ ఆయుధాలతో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడడంతో వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని జమ్మూ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్ పోలీస్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌‌కు తీవ్రగాయాలయ్యాయి.