Supreme Court: రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ పరిధిని పెంచలేరు: సుప్రీంకోర్టు కీలక రూలింగ్

  • వద్దనుకున్న రాష్ట్రాల్లోకి వెళ్లేందుకు సీబీఐకి అనుమతి లేదు
  • రాజ్యాంగ నిబంధనల మేరకు నడచుకోవాల్సిందే
  • సుప్రీం న్యాయమూర్తులు ఖాన్ విల్కర్ గవాయ్ స్పష్టీకరణ
Center Cant Extened CBI Jurisdiction says Supreem

ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, విచారణలో సీబీఐ కల్పించుకునేందుకు వీల్లేదని, రాష్ట్రాల అనుమతి లేకుండా, సీబీఐ పరిధిని పెంచడం కూడా సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. యూపీలోని ఓ అవినీతి కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు కీలక రూలింగ్ ఇచ్చింది.

"ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం, సీబీఐ పరిధిని రాష్ట్రాల అనుమతి లేకుండా విస్తరించేందుకు వీల్లేదు. రాజ్యాంగ నిబంధనల మేరకు నడచుకోవాల్సిందే. రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ కేసుల విచారణకూ వెళ్లేందుకు వీల్లేదు" అని పేర్కొంది.

కాగా, దేశంలో విపక్షాల పరిపాలనలో ఉన్న రాజస్థాన్, బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పంజాబ్, మిజోరం రాష్ట్రాలు, తమ ప్రాంతంలో సీబీఐ విచారణకు అనుమతించబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏఎం ఖాన్ విల్కర్, బీఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సీబీఐని నియంత్రించే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టాన్ని కూడా ప్రస్తావించింది. చట్టంలోని సెక్షన్ 5లో ఇందుకు సంబంధించి స్పష్టమైన వివరణ ఉందని తెలిపింది.

More Telugu News