విజయశాంతి బీజేపీలో చేరుతారు: బండి సంజయ్

19-11-2020 Thu 10:09
  • వరద సాయాన్ని ఆపాలంటూ నేను లేఖ రాయలేదు
  • ఆ సంతకం నాదికాదు, ఫోర్జరీ చేశారు
  • ప్రభుత్వం మరీ ఇంత నీచానికి దిగజారుతుందనుకోలేదు
that is forged signature clarifies Telangana BJP Chief

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. వరద సాయాన్ని ఆపాలంటూ ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన.. తాను రాసినట్టు ఉన్న లేఖలోని సంతకం తనది కాదని, దానిని ఫోర్జరీ చేశారని అన్నారు.

ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆ లేఖను ఎవరు రాశారు? అందులోని సంతకం ఎవరిదన్న విషయం తేలాల్సిందేనన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రికి రాసిన లేఖపై సంతకాన్ని చూస్తే, ఇప్పటి సంతకం నకిలీదని ఇట్టే గుర్తుపట్టవచ్చన్నారు. వరద సాయం పంపిణీకి బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే, ఈ మాత్రంతో సరిపెట్టకుండా నష్టానికి పూర్తి పరిహారం ఇవ్వాలని బీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సంతకాలు ఫోర్జరీ చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిందని బండి సంజయ్ ఆరోపించారు.