New Delhi: వివాహేతర సంబంధం.. ఢిల్లీ వ్యాపారి దారుణ హత్య... గుజరాత్ లో మృతదేహం!

Delhi Business Man Murdered and Deadbody in Gujarath
  • తన వద్ద పనిచేస్తున్న యువతితో వివాహేతర బంధం
  • ఇంటికి పిలిపించి దారుణంగా చంపిన వైనం
  • హత్యకు సహకరించిన యువతి తల్లి, ఫియాన్సీ కూడా అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురికాగా, అతని మృతదేహం గుజరాత్ లోని భారుచ్ లో లభ్యమైంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన నీరజ్ గుప్తా (46) అనే వ్యాపారి, తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినితో వివాహేతర బంధాన్ని నడుపుతున్నాడు. ఆ యువతికి కాబోయే భర్త.. వ్యాపారి నీరజ్ ను దారుణంగా హత్య చేసి, శవాన్ని సూట్ కేసులో పెట్టి, రైలెక్కి, గుజరాత్ వరకూ ప్రయాణించి, భారుచ్ ప్రాంతంలో పడేసి వచ్చాడు.

సదరు యువతి అద్దెకుంటున్న ఇంట్లో ఈ హత్య జరిగిందని, నవంబర్ 13న నీరజ్, అతని ప్రియురాలు, ఆమె తల్లి, కాబోయే భర్త తదితరులు కలిశారని, ఆపై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత, తొలుత నీరజ్ తలపై ఇటుకతో కొట్టి, ఆపై కడుపులో మూడు సార్లు పొడిచి, గొంతుకు ఉరి బిగించి హత్య చేశారని, ఇందుకు సదరు యువతి, ఆమె తల్లి కూడా సహకరించారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో యువతి ఫైసల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), ఫైసల్ కు కాబోయే భర్త జుబేర్ (28)లను అరెస్ట్ చేశామని పోలీసు అధికారి విజయాంత ఆర్యా వెల్లడించారు.

నీరజ్ గుప్తా కనిపించడం లేదని ఆయన భార్య ఆదర్శ్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తరువాత, కేసును విచారించామని, ఆమే ఫైసల్ గురించిన క్లూ ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఆపై గుజరాత్ లో బయటపడిన మృతదేహం నీరజ్ దేనని గుర్తించామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని వెల్లడించారు.
New Delhi
Murder
Business Man
Niraj Gupta
Gujarath

More Telugu News