తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!

19-11-2020 Thu 09:12
  • 24 గంటల్లో  1,058  కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,834
  • 2,46,733 మంది డిశ్చార్జ్ 
  • మృతుల సంఖ్య మొత్తం 1,419 
spike of 1058 new cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో 1,058  కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,440 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,834 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,46,733 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,419 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,682 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 10,352 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 91 కేసులు నిర్ధారణ అయ్యాయి.