Sasikala: శశికళ విడుదలకు మార్గం సుగమం.. రూ.10.10 కోట్ల జరిమానా చెల్లించిన న్యాయవాది

  • అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ
  • ఒకటి, రెండు రోజుల్లోనే విడుదలయ్యే అవకాశం ఉందన్న ఆమె న్యాయవాది
  • ‘చిన్నమ్మ’ వచ్చినా పార్టీలో మార్పులేమీ ఉండబోదన్న సీఎం పళనిస్వామి
VK Sasikala Pays Rs 10 Crore Fine

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ (69) త్వరలోనే విడుదల కానున్నారు. జరిమానాగా కోర్టుకు చెల్లించాల్సిన రూ. 10.10 కోట్ల జరిమానాను కోర్టుకు చెల్లించిన ఆమె తరపు న్యాయవాదులు, అందుకు సంబంధించిన రసీదును శిశికళ ఉంటున్న పరప్పన అగ్రహార జైలు అధికారులకు పంపించారు. దీంతో ఆమె విడుదలకు మార్గం సుగమం అయింది.

శశికళ తరపు న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ జరిమానాగా చెల్లించాల్సిన రూ. 10.10 కోట్లను డీడీ రూపంలో న్యాయమూర్తికి అందించారు. అన్ని ప్రక్రియలు సజావుగానే సాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో ‘చిన్నమ్మ’ విడుదల కావచ్చని ఆమె తరపు న్యాయవాది పాండియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, శశికళ జైలు నుంచి విడుదలైనంత మాత్రాన అన్నాడీఎంకేలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని సీఎం ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు.

More Telugu News