బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు?

19-11-2020 Thu 07:45
  • ప్రచారంలో డాక్టర్ వివేక్‌మూర్తి, అరుణ్ మజుందార్ పేర్లు
  • ఆరోగ్య మంత్రిగా వివేక్, ఇంధనశాఖ మంత్రిగా అరుణ్ నియమితులయ్యే అవకాశం
  • కర్ణాటక నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన వివేక్ మూర్తి తల్లిదండ్రులు
 Vivek Murthy and Arun Majumdar Likely Faces In Bidens Cabinet

అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు లభించనున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు డాక్టర్ వివేక్‌మూర్తి (43) కాగా, మరొకరు ప్రొఫెసర్ అరుణ్ మజుందార్. ఆరోగ్యం, మానవసేవల మంత్రిగా వివేక్‌మూర్తి, ఇంధనశాఖ మంత్రిగా అరుణ్ మజుందార్ నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వివేక్‌మూర్తి ప్రస్తుతం కరోనా వ్యవహారాలపై బైడెన్‌కు సలహాదారుగా ఉన్నారు. ఒబామా ప్రభుత్వ హయాంలో సర్జన్ జనరల్‌గా పనిచేశారు.

అరుణ్ మజుందార్ ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఒబామా హయాంలో నెలకొల్పిన అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (ఎనర్జీ)కి తొలి డైరెక్టర్‌గా వ్యవహరించారు. వివేక్‌మూర్తి తల్లిదండ్రులు కర్ణాటక నుంచి తొలుత ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. 1977లో వివేక్ యార్క్‌షైర్‌లో జన్మించారు. 2008లో డాక్టర్స్ ఫర్ అమెరికా అనే సంస్థను ప్రారంభించారు.