Corona Virus: ప్రపంచానికి శుభవార్త చెప్పిన ఫైజర్.. తమ టీకా 95 శాతం సమర్థత ప్రదర్శించిందని ప్రకటన

  • విశ్లేషణ వివరాలు వెల్లడించిన ఫైజర్
  • మొత్తం 170 మందిపై ప్రయోగం
  • 28 రోజుల్లోనే సత్ఫలితాలు
pfizer corona vaccine 95 percent effective

కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్న ప్రపంచానికి ఇది శుభవార్తే. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తోందని, 95 శాతం సమర్థత ప్రదర్శించిందని అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్లకు పైబడిన వారిలోనూ దీని సమర్థత 94 శాతానికి పైగా ఉందని వివరించింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని వయసుల వారిలోనూ దీని ప్రభావం స్థిరంగా ఉందని, త్వరలోనే యూఎస్ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది.

తమ వ్యాక్సిన్ 90 శాతం ఫలితాలు ఇస్తోందని గతవారం ప్రకటించిన ఫైజర్ తాజాగా 95 శాతం సమర్థత ప్రదర్శించినట్టు పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాజా విశ్లేషణను నేడు వెల్లడించిన ఫైజర్.. 170 మంది కరోనా రోగులపై టీకాను ప్రయోగించగా తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు వచ్చినట్టు వివరించింది. కాగా, ఈ టీకాను మైనస్ 70 డిగ్రీల వద్ద మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండడంతో ఆ వసతులు లేని దేశాలు టీకా కొనుగోలుపై డోలాయమానంలో ఉన్నాయి.

More Telugu News