సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ‘సోలో బ్రతుకే సో బెటర్’

18-11-2020 Wed 20:15
  • హీరోహీరోయిన్లుగా సాయిధరమ్ తేజ్, నభా నటేశ్
  • వచ్చే నెలలో థియేటర్లలో విడుదల చేస్తామన్న జీస్టూడియోస్
  • లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా రికార్డులకెక్కే అవకాశం
solo brathuke so better movie will be releasing in Theaters

కరోనా కారణంగా చితికిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది శుభవార్తే. మహమ్మారి కారణంగా మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం చిన్నా పెద్దా సినిమాలన్నీ ఓటీటీ ద్వారానే విడుదలవుతుండగా, లాక్‌డౌన్ తర్వాత తొలిసారి సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ నటించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను వచ్చే నెలలో థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు జీస్టూడియోస్ ప్రకటించింది. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ సినిమా కనుక థియేటర్లలో విడుదలైతే, లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన తొలి సినిమాగా రికార్డులకెక్కుతుంది. సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహించగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.