GHMC Elections: ‘గ్రేటర్’ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే!

Congress released candidates first list for ghmc elections
  • 29 మందితో కూడిన తొలి జాబితా విడుదల
  • రాత్రికి టీఆర్ఎస్ కూడా జాబితా విడుదల చేసే అవకాశం
  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వామపక్షాలు
గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అప్పుడే రంగంలోకి దిగింది. నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, నేటి సాయంత్రం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 29 మంది అభ్యర్థులను ప్రకటించగా, నేటి రాత్రికి మరో 15 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ కూడా నేటి రాత్రికి అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉండగా, వామపక్ష పార్టీలు ఇప్పటికే పలు స్థానాల కోసం అభ్యర్థులను ప్రకటించాయి.  

*   కాప్రా - పత్తి కుమార్
*    ఏఎస్‌రావునగర్ - శిరీష రెడ్డి
*    ఉప్పల్ - ఎం.రజిత
*    నాగోల్ - ఎం.శైలజ
*    మున్సూరాబాద్ - జక్కడి ప్రభాకర్
*    ఆర్కేపురం - పున్న గణేష్
*    హయత్‌నగర్ -  గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి
*    హస్తినపురం - సంగీత నాయక్
*    గడ్డిఅన్నారం - వెంకటేశ్ యాదవ్
*    సులేమాన్‌నగర్ -  రిజ్వానా బేగం
*    మైలార్‌దేవ్‌పల్లి - శ్రీనివాస్ రెడ్డి
*    రాజేంద్రనగర్ - బత్తుల దివ్య
*    అత్తాపూర్ - వాసవి భాస్కర్‌గౌడ్
*    కొండాపూర్ - మహిపాల్ యాదవ్
*    మియాపూర్ - షరీఫ్
*    అల్లాపూర్ - కౌసర్ బేగం
*    బేగంపేట్ - మంజుల రెడ్డి
*    మూసాపేట్ -  జి.రాఘవేంద్ర
*    ఓల్డ్ బోయినపల్లి -  అమూల్య
*    బాలానగర్ - సత్యం శ్రీ రంగం
*    కూకట్‌పల్లి - తేజశ్వర్ రావు
*    గాజులరామారం - శ్రీనివాస్ గౌడ్
*    రంగారెడ్డి నగర్ -  గిరగి శేఖర్
*    సూరారం - బి.వెంకటేశ్
*    జీడిమెట్ల - బండి లలిత
*    నెరేడ్‌మెట్ - మరియమ్మ
*    మౌలాలి - ఉమామహేశ్వరి
*    మల్కాజ్‌గిరి - శ్రీనివాస్ గౌడ్
*    గౌతంనగర్ -  టి.యాదవ్‌
GHMC Elections
Congress
First list
TRS

More Telugu News