టీఆర్ఎస్ ఓట్ల కక్కుర్తికి మహిళ బలి.. పాప పరిహారం చెల్లించక తప్పదు: రేవంత్ ఫైర్

18-11-2020 Wed 19:43
  • గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతి
  • ఉదయం నుంచి క్యూలో నిల్చుని ప్రాణాలు విడిచిన వైనం
  • టీఆర్ఎస్ ఓట్ల కక్కుర్తికి మహిళ బలైందని ఆవేదన
Revanth Reddy fires on TRS govt

వరద సాయం కోసం ఉదయం నుంచి క్యూలో నిల్చున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంపై మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం నుంచి ‘మీ సేవ’ కేంద్రం వద్ద నిల్చున్న ఓ మహిళ స్పృహతప్పి పడిపోయి చనిపోయింది. ఈ ఘటనపై స్పందించిన రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సాయం కోసం వెళితే ప్రాణమే పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఓట్ల కక్కుర్తికి ఓ మహిళ బలైందని, ఈ పాపానికి పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.