KCR: జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల.. హైదరాబాద్ వ్యాప్తంగా ఉచిత వైఫై!

  • తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం
  • సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలమన్న కేసీఆర్
  • కాంగ్రెస్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
TRS releases GHMC elections manifesto

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 స్థానాల్లో గెలవబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తమ సర్వేల్లో ఇది తేలిందని తెలిపారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు ఏ డివిజన్ లో బాధ్యతలను అప్పగించినా... పూర్తి బాధ్యత వహించి గట్టిగా పని చేయాలని అన్నారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

 ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రైల్వే, ఎల్ఐసీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను కలుపుకుని వెళ్లాలని సూచించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేస్తామని... మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్ వంటి నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పారు.

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇవే.

  • నగరంలో కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం
  • అన్ని గ్రంథాలయాల ఆధునికీకరణ
  • రూ. 130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు
  • నగరమంతా ఉచిత వైఫై సదుపాయం
  • రూ. 1900 కోట్లతో మరో 280 కి.మీ. మేర మిషన్ భగీరథ పైప్ లైన్
  • మూసీ సుందరీకరణ.. హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక.

More Telugu News