లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 44 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

18-11-2020 Wed 16:39
  • 227 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 64 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 11 శాతం వరకు పెరిగిన ఎం అండ్ ఎం
Sensex crosses 44k mark

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్ చివర్లో బ్యాంకింగ్ స్టాకుల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 227 పాయింట్లు లాభపడి 44,180కి పెరిగింది. నిఫ్టీ 64 పాయింట్లు పుంజుకుని 12,938 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (10.76%), ఎల్ అండ్ టీ (6.15%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.67%), బజాజ్ ఫిన్ సర్వ్ (5.62%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.93%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-2.07%), ఐటీసీ (-1.74%), టైటాన్ (-1.69%), టీసీఎస్ (-1.51%), భారతి ఎయిర్ టెల్ (-1.26%).