Banda Karthika: బీజేపీలో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ 

Hyderabad EX Mayor Banda Karthika joins BJP
  • కాషాయ కండువా కప్పుకున్న బండ కార్తీక
  • కాంగ్రెస్ తనను రెండు సార్లు మోసం చేసిందని మండిపాటు
  • ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే అని వ్యాఖ్య
హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తొలి నుంచి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని... బీజేపీలో చేరడం తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను రెండు సార్లు మోసం చేసిందని అన్నారు. బీజేపీలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే తాను ఈ పార్టీలో చేరానని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను కార్పొరేటర్ గా పోటీ చేయడం లేదని, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేద్దామని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి చెప్పారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి నాయకుడు కలిసికట్టుగా పని చేశాడని అన్నారు.
Banda Karthika
BJP
Congress
GHMC Elections

More Telugu News