హీరోయిన్ కంగనతో పాటు ఆమె సోదరికి పోలీసుల నుంచి సమన్లు

18-11-2020 Wed 13:35
  • ఉద్రిక్తతలు పెంచేలా మత సంబంధిత అంశాలపై వ్యాఖ్యలు
  • నవంబరు 23న కంగనా రనౌత్ హాజరుకావాలి
  • నవంబరు 24న రంగోలీ సమాధానం చెప్పాలి
  • మూడో సారి సమన్లు పంపిన పోలీసులు
Kangana Ranaut and Rangoli Chandel summoned by Police

కంగన రనౌత్ తో పాటు ఆమె సోదరి రంగోలీ చాందల్‌కు ముంబై పోలీసులు ఈ రోజు సమన్లు పంపారు. ఉద్రిక్తతలు పెంచేలా మత సంబంధిత అంశాలపై సామాజిక మాధ్యమాల్లో వారిద్దరు చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు పంపారు. నవంబరు 23న కంగన రనౌత్, నవంబరు 24న రంగోలీ బంద్రా పోలీసు స్టేషన్‌లో తమ ముందు హాజరై వాటిపై సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు.

కంగన రనౌత్, రంగోలీకి ముంబై పోలీసులు సమన్లు పంపడం ఇది మూడోసారి. అక్టోబరు 26, 27 తేదీల్లో ఓసారి, నవంబరు 9, 10 తేదీల్లో మరోసారి తమ ముందు హాజరుకావాలంటూ పోలీసులు వారిని ఆదేశించగా వారు హాజరుకాలేదు. తాను బిజీగా ఉన్నానని, తమ కుటుంబంలోని ఒకరి పెళ్లి ఉందని, నవంబరు 15 తర్వాత ఫ్రీగా ఉంటానని కంగన అప్పట్లో తెలిపింది.