IYR Krishna Rao: హైకోర్టు వారు ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు: ఐవైఆర్ కృష్ణారావు

iyr tweets about ap decision on swaroopanandra birth day celebrations
  • ప్రభుత్వాలు ఏ ఇతర మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవట్లేదు
  • హిందూ మత  అంశాలలో మాత్రం జోక్యం
  • ప్రభుత్వాలు వ్యవస్థలను, ఆలయాలను నిర్వీర్యం చేస్తున్నాయి
  • సుబ్రహ్మణ్య స్వామి గారి వ్యాజ్యాన్ని త్వరగా పరిష్కరించాలి
మత సంబంధ అంశాల్లో సర్కారు జోక్యం చేసుకోవడం ఎందుకంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టిందంటూ ఈనాడులో ప్రచురించిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దీనిపై తన  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘హైకోర్టు వారు ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు. ఏ ఇతర మత వ్యవహారాలలో లేని విధంగా హిందూ మత  అంశాలలో జోక్యం చేసుకుని ప్రభుత్వాలు వ్యవస్థలను, ఆలయాలను నిర్వీర్యం చేస్తున్నాయి. హైకోర్టు ముందే ఉన్న  సుబ్రహ్మణ్య స్వామి (బీజేపీ నేత) గారి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని త్వరగా పరిష్కరిస్తే ప్రశ్నకు సమాధానం రావచ్చు’ అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.
IYR Krishna Rao
YSRCP
swaroopananda

More Telugu News