Nimmagadda Ramesh: గవర్నర్‌తో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ భేటీ.. ‘స్థానిక’ ఎన్నికలపై ప్రకటన చేసే అవకాశం

  • ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరంపై చర్చ
  • ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లపై వివరణ
  • కాసేపట్లో ఏపీలోని జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌
nimmagadda meets governer

స్థానిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ వేడి మొదలైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు ఎన్నికల సంఘం తెలిపిన నేపథ్యంలో ఈ విషయంపై ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కలిసి పలు వివరాలు తెలిపారు.

ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం, ఎన్నికల ప్రక్రియపై ఇప్పటి వరకు తాము చేపట్టిన చర్యలపై గవర్నర్‌తో నిమ్మగడ్డ చర్చిస్తున్నట్లు తెలిసింది. అనంతరం ఏపీలోని జిల్లా అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు నిమ్మగడ్డ ఓ లేఖ రాశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని అందులో పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. ఎన్నికల నిర్వహణపైనే వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్లు లేఖలో నిమ్మగడ్డ  స్పష్టంగా పేర్కొన్నారు.

More Telugu News