నటి గౌతమి ఇంట్లోకి ప్రవేశించిన అపరిచితుడు!

18-11-2020 Wed 12:26
  • ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న గౌతమి
  • ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన పాండియన్
  • అరెస్ట్ చేసిన పోలీసులు
Unknown Person Arrested in Actress Gautami House

చెన్నైలోని కొట్టివక్కమ్ ప్రాంతంలో వుంటున్న సినీ నటి గౌతమి ఇంట్లో ఓ అపరిచితుడు ప్రవేశించి హల్ చల్ చేశాడు. పాండియన్ అనే వ్యక్తి, పూటుగా మద్యం తాగి, అనుమతి లేకుండా గౌతమి ఇంట్లోకి ప్రవేశించగా, ఇంట్లో పనిచేస్తున్న సతీశ్ చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు వచ్చి పాండియన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, గౌతమి ఇంట్లో తన సోదరుడు పని చేస్తుండగా, అతన్ని చూసేందుకే పాండియన్ వెళ్లాడని తేలడంతో బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఇదే సమయంలో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.