Ahmedabad: బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని స్పైస్ జెట్ ఉద్యోగిని కొట్టిన పోలీసు!

SI Cader Person Slap Spice Jet Employee in Airport
  • అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘటన
  • ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా వచ్చిన ఎస్ క్యాడర్ వ్యక్తి
  • అనుమతించ లేదని తీవ్ర ఆగ్రహం
తమకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కారణంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ఎస్ఐ క్యాడర్ వ్యక్తి, స్పైస్ జెట్ సిబ్బందిపై చెయ్యి చేసుకున్న ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, పోలీసు అధికారి ఒకరు ఢిల్లీకి వెళ్లేందుకు మరో ఇద్దరితో కలిసి స్పైస్ జెట్ ఎస్జీ-8194లో టికెట్లు తీసుకున్నారు. వారంతా విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే బోర్డింగ్ ముగిసిందని, విమానంలోకి అనుమతించ లేమని స్పైస్ జెట్ ఉద్యోగులు స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ అధికారి ఓ ఉద్యోగి చెంప పగులగొట్టాడు. అతనితో ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణికులు స్పైస్ జెట్ సిబ్బందితో గొడవకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎయిర్ పోర్టు సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్ స్టాఫ్ రావాల్సి వచ్చింది. ఆపై విమానాశ్రయ ఉద్యోగిని, పోలీసును, మరో ఇద్దరినీ తీసుకెళ్లి పోలీసు స్టేషన్ లో అప్పగించారు. అయితే, ఇరు పక్షాలు రాజీకి రావడంతో ఈ విషయమై ఎటువంటి కేసూ నమోదు కాలేదు. సదరు పోలీసు అధికారిని, అతనితో పాటు ఉన్న ఇద్దరినీ విమానంలో ప్రయాణించేందుకు మాత్రం స్పైస్ జెట్ అంగీకరించ లేదు.
Ahmedabad
Police
Spice Jet
Slap
SI

More Telugu News