జో బైడెన్ తో ఫోన్ లో మాట్లాడాను: ప్రధాని నరేంద్ర మోదీ

18-11-2020 Wed 09:08
  • అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపా
  • వ్యూహాత్మక బంధం కొనసాగించాలని నిర్ణయం
  • పలు అంశాలపై చర్చించామన్న మోదీ
Modi Called Joe Biden

అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తో తాను మాట్లాడానని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. "అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు జో బైడెన్ తో ఫోన్ లో మాట్లాడాను. అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని మేము నిర్ణయించాం. పలు ప్రాధాన్యతాంశాలు, సవాళ్లు మా మధ్య చర్చకు వచ్చాయి. కొవిడ్-19 మహమ్మారి, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ రీజియన్ లో సహాయ సహకారాలు సహా పలు అంశాల గురించి మాట్లాడుకున్నాం" అని మోదీ తెలియజేశారు.