సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

18-11-2020 Wed 07:21
  • వచ్చే నెలలో 'ఆచార్య' షూటింగుకు కాజల్ 
  • పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్?
  • నాగేశ్వర్ రెడ్డితో సందీప్ కిషన్ సినిమా  
Kajal will join Acharya sets next month

*  చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగులో కథానాయిక కాజల్ డిసెంబర్ 5న జాయిన్ కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాజల్ భర్తతో కలసి మాల్దీవులలో హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది.
*  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ చరణ్ ల కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చరణ్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇది వుండచ్చని అంటున్నారు. అన్నట్టు, చరణ్ తన మొదటి చిత్రం 'చిరుత'ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన సంగతి విదితమే.
*  ప్రస్తుతం 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రంలో నటిస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రాన్ని జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. వచ్చే నెల నుంచి దీని షూటింగ్ మొదలవుతుంది.