ఉదయం 11 గంటలకు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

18-11-2020 Wed 06:36
  • ఎన్నికల కార్యాచరణ గురించి గవర్నర్‌కు వివరించనున్న నిమ్మగడ్డ
  • ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే కోర్టులో అఫిడవిట్
  • ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని గవర్నర్‌కు ఇప్పటికే స్పష్టం చేసిన జగన్?
EC Nimmagadda Ramesh Kumar meet Governor Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నేటి ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమైన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ గురించి గవర్నర్‌‌కు వివరించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, దీపావళి ముందు రోజు గవర్నర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఈసీ ఇప్పటికే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.