బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితం: బండి సంజయ్

17-11-2020 Tue 18:24
  • తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు
  • బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
  • 150 డివిజన్లలో మా అభ్యర్థులనే నిలబెడతాం
BJP has no friendship with Janasena in Telangana says Bandi Sanjay

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రకటించారు. అయితే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని... మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు. మరోవైపు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? లేక విడివిడిగా పోటీ చేస్తాయా? అనే విషయం తేలాల్సి ఉంది.