ఏపీలో కొత్తగా 1,375 కరోనా కేసుల నమోదు.. అప్ డేట్స్ ఇవిగో!

17-11-2020 Tue 17:57
  • 24 గంటల్లో 9 మంది మృతి
  • ఇదే సమయంలో మహమ్మారి నుంచి కోలుకున్న 2,293 మంది పేషెంట్లు
  • ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులు
Andhra Pradesh registers 1375 cases in 24 hours

ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,395 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 260 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 18 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది చనిపోయారు. అలాగే, 2,293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం కేసులు 8,56,159కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 6,890 మంది మృతి చెందారు.