ధోనీని వేలానికి విడుదల చేసి.. మళ్లీ కొనుక్కోండి: ఆకాశ్ చోప్రా

17-11-2020 Tue 17:41
  • ధోనీని అలాగే ఉంచుకుంటే ఏడాదికి రూ. 15 కోట్లు ఇవ్వాలి
  • ఆయనను విడుదల చేసి తక్కువ ధరకు కొనుక్కోండి
  • దీని వల్ల చెన్నైకి డబ్బులు మిగులుతాయి
Akash Chopra suggests to release Dhoni for Mega Auction

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీని ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఒకవేళ ఐపీఎల్ మెగా ఆక్షన్ ఉండేట్టైతే... ధోనీని రిలీజ్ చేయాలని సీఎస్కే యాజమాన్యానికి సూచించాడు.

ఒకవేళ ధోనీని అలాగే ఉంచుకుంటే సీఎస్కే రూ. 15 కోట్లు నష్టపోతుందని చెప్పారు. అందువల్ల ధోనీని రిలీజ్ చేసి ఆక్షన్ పూల్ (వేలంపాట)కు పంపాలని... అక్కడ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకుని ధోనీని మళ్లీ కొనుక్కోవాలని సూచించాడు. ధోనీని వదిలించుకోమని తాను చెప్పడం లేదని... అతన్ని అలాగే ఉంచుకుంటే ఏడాదికి రూ. 15 కోట్లు చెల్లించుకోవాల్సి ఉంటుందని మాత్రమే చెపుతున్నానని తెలిపారు. తాను చెప్పినట్టు చేస్తే చెన్నై జట్టుకు డబ్బులు మిగులుతాయని చెప్పాడు.