ఆఫీసులో కార్యక్రమానికి నో చెప్పడం బీసీలను అవహేళన చేయడం కాదా విజనరీ...?: విజయసాయిరెడ్డి

17-11-2020 Tue 16:29
  • ట్విట్టర్ లో విజయసాయి వ్యాఖ్యలు
  • అబ్బాయికిస్తారని ఊరించి బాబాయికిచ్చారని విమర్శలు
  • బాబు చీదరించుకున్నారంటూ వెల్లడి
Vijayasai Reddy comments in Twitter

వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఆసక్తికర పోస్టు చేశారు. అబ్బాయికిస్తారని ఊరించి బాబాయి అచ్చెన్నను అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఆ పదవి విలువ ఏపాటిదో అందరికీ తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధ్యక్ష ప్రమాణానికి రానని బాబు చీదరించుకుంటున్నాడని, కనీసం పార్టీ ఆఫీసులో ప్రోగ్రాం పెట్టుకోవడానికి నిరాకరించడం బీసీలను అవహేళన చేయడం కాదా విజనరీ? అంటూ వ్యాఖ్యలు చేశారు.