చెన్నాయపాలెం తండాకు చెందిన ఎలమంద నాయక్ దంపతులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు

17-11-2020 Tue 15:57
  • ఎలమంద నాయక్ పై దాడి
  • వైసీపీ నేతల పనే అంటూ టీడీపీ ఆరోపణలు
  • తాము అండగా నిలుస్తామన్న చంద్రబాబు
 Chandrababu talks to Yalamanda Naik

గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం తండాకు చెందిన ఎలమంద నాయక్ అనే వ్యక్తి ఇటీవల తనపై దాడి జరిగిందని వెల్లడించడం తెలిసిందే. గుంటూరు జిల్లాలో సరస్వతి సిమెంట్ పరిశ్రమ కోసం సేకరించి నిరుపయోగంగా వదిలేసిన భూముల్లో సాగుచేసుకుంటున్నందుకు తనను చితకబాదారని వెల్లడించారు. ఇది వైసీపీ వాళ్ల పనే అని టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.... ఎలమంద నాయక్ దంపతులతో ఫోన్లో మాట్లాడారు. వారిని పరామర్శించారు. వారికి తాము అండగా నిలుస్తామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. అన్ని విషయాలు తాను చూసుకుంటానంటూ, మీకేమీ కాదని భరోసా ఇచ్చారు. ఏదేమైనా రైతుపై దాడి దుర్మార్గమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.