రామ్ చరణ్, మంచు లక్ష్మితో మనోజ్ దీపావళి వేడుకలు

17-11-2020 Tue 15:37
  • సోషల్ మీడియాలో ఫొటో పంచుకున్న మంచు మనోజ్
  • దీపావళి సంబరాలు గొప్పగా జరిగాయంటూ ట్వీట్
  • చెర్రీ, మంచు లక్ష్మిలను తనకిష్టమైన వాళ్లుగా పేర్కొన్న మనోజ్
Manchu Manoj shares the moments with Ram Charan and Manchu Lakshmi

టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ దీపావళి వేడుకలకు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హీరో రామ్ చరణ్, తన సోదరి మంచు లక్ష్మిలతో కలిసి తాను దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నదీ వెల్లడించారు. దీపావళి సంబరాలు చాలా గొప్పగా జరిగాయని, ప్రియమైన సోదరుడు రామ్ చరణ్, ప్రేమాస్పదురాలైన తన అక్క మంచు లక్ష్మి సమక్షంలో వేడుక చేసుకున్నానని తెలిపారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో నిజమైన పండుగ జరుపుకున్నానని మనోజ్ ట్వీట్ చేశారు. కాగా, మనోజ్ పంచుకున్న ఫొటోలో రామ్ చరణ్ ఓ కేక్ కట్ చేస్తుండడాన్ని చూడొచ్చు.