వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సానియా మీర్జా

17-11-2020 Tue 15:12
  • యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టనున్న సానియా
  • 'నిషేద్ ఎలోన్ టుగెదర్' అనే వెబ్ సిరీస్ లో మెరవనున్న టెన్నిస్ తార
  • ఐదు ఎపిసోడ్ లుగా నిర్మితమవుతున్న సిరీస్
Sania Mirza to act in web series

భారత టెన్నిస్ చరిత్రలో సానియా మీర్జాది ఒక సువర్ణాధ్యాయం. అద్భుతమైన ఆటతీరుతోనే కాకుండా, తన అందంతో కూడా ఎందరో అభిమానులను ఆమె సంపాదించుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆటకు దూరంగా ఉంటోంది. కరోనా వల్ల ఎక్కడా టెన్నిస్ టోర్నీలు కూడా జరగడం లేదు.

ఈ క్రమంలో తాజాగా సానియా మీర్జా గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. టెన్నిస్ రాకెట్ ను పక్కన పెట్టి, యాక్టింగ్ రంగంలోకి సానియా అడుగుపెట్టబోతోందనేదే ఆ వార్త. బుల్లితెరపై మెరవడానికి సానియా సిద్ధమవుతోందట. 'నిషేద్ ఎలోన్ టుగెదర్' అనే వెబ్ సిరీస్ లో సానియా నటిస్తోందట. మొత్తం ఐదు ఎపిసోడ్ లుగా ఈ సిరీస్ ప్రసారం కాబోతోంది.