విజయసాయి అవినీతి లీలలు చూసి వైసీపీ ఎమ్మెల్యేలే నివ్వెరపోతున్నారు: బుద్ధా వెంకన్న

17-11-2020 Tue 14:17
  • విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తిన బుద్ధా
  • విజయసాయి ఆధిపత్యంతో వైసీపీలో అసంతృప్తి ఉందన్న బుద్ధా
  • సొంతపార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారని వెల్లడి
Budda Venkanna says YCP members has been shocked after seen Vijayasai corruption

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి భూకబ్జాలు, అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని బుద్ధా సవాల్ విసిరారు. విజయసాయి ఆధిపత్యం తట్టుకోలేక సొంతపార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారని వెల్లడించారు. విజయసాయి అవినీతి లీలలు చూసి వైసీపీ ఎమ్మెల్యేలు నివ్వెరపోతున్నారని తెలిపారు. బుద్ధా సీఎం జగన్ పైనా వ్యాఖ్యలు చేశారు. జగన్ బీసీ ద్రోహి అని విమర్శించారు. బీసీలను జగన్ రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ నేతలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు