అమరావతి రైతులు, మహిళలతో సమావేశం కానున్న పవన్ కల్యాణ్

17-11-2020 Tue 13:07
  • గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన నేతలతోనూ భేటీ
  • ఈ రోజు, రేపు పవన్ బిజీ
  • జనసేనను బలోపేతం చేయడంపై దృష్టి
pawan to meet amaravati farmers

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు, రేపు ఆయన జనసేన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగానే ఆయన అమరావతి రైతులు, మహిళలతోనూ సమావేశం కానున్నారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలల పాటు ఫాంహౌస్‌లోనే అధిక సమయాన్ని గడిపిన పవన్.. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగులో కూడా పాల్గొన్నారు. ఆ మధ్య పలుసార్లు ఆన్ లైన్‌ ద్వారా పార్టీ సమావేశాలు నిర్వహించారు. గుంటూరులో తమ పార్టీ నేతలతో చర్చించి ఏపీలో జనసేనను బలోపేతం చేయడం పట్ల ఆయన సూచనలు ఇస్తారని తెలుస్తోంది.