అలాంటి వ్యక్తి దొరకకపోతే.. జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను: త్రిష

17-11-2020 Tue 13:00
  • మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా
  • సరైన వ్యక్తి దొరికితేనే నా వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది
  • అప్పటి వరకు సింగిల్ గానే ఉంటా
Actor Trisha speaks about her marriage

దాదాపు రెండు దశాబ్దాల క్రితం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చెన్నై భామ త్రిష... తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటిగా కొనసాగింది. 37 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఆమె సినీ గ్లామర్ తగ్గలేదు. అయితే... వయసు పెరుగుతున్నా ఆమె మాత్రం పెళ్లికి దూరంగానే ఉంటోంది. గతంలో ఒక వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే, కొన్ని కారణాల వల్ల అది పెళ్లి వరకు వెళ్లలేకపోయింది.

తర్వాత మధ్యలో ఆమెకు సంబంధించిన కొన్ని ప్రేమ వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత సద్దుమణిగాయి. తాజాగా తమిళ హీరో శింబుతో త్రిష ప్రేమలో ఉందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అంశంపై త్రిష స్పందించింది.

తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని త్రిష తెలిపింది. తనను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే తన వైవాహిక జీవితం ప్రారంభమవుతుందని చెప్పింది. తన మనసుకు నచ్చే వ్యక్తి దొరికేంత వరకు సింగిల్ గానే ఉంటానని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసింది.