దుబాయ్ నుంచి వచ్చాక.. మళ్లీ 'ఆర్ఆర్ఆర్'కి ఎన్టీఆర్!

17-11-2020 Tue 12:51
  • దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ ఫ్యామిలీ 
  • గత వారం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్
  • ప్రస్తుతం ఫ్యామిలీతో దుబాయ్ లో వున్న జూనియర్  
  • 'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా  
NTR will join RRR shoot after returning from Dubai

మన తారలు అప్పుడప్పుడు షూటింగుల బిజీ నుంచి కాస్త ఉపశమనం కోసం ఫ్యామిలీతో కలసి విదేశీ విహార యాత్రలకు వెళుతుంటారు. ఇటీవలే మహేశ్ బాబు కూడ అలాగే తన ఫ్యామిలీతో కలసి దుబాయ్ వెళ్లాడు. ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా గత వారం కుటుంబ సభ్యులతో కలసి హాలిడే కోసం దుబాయ్ వెళ్లాడు. మరో వారం తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తాడని తెలుస్తోంది.

ఇదిలావుంచితే, లాక్ డౌన్ తర్వాత ఆమధ్యనే ఎన్టీఆర్ మళ్లీ 'ఆర్ఆర్ఆర్' షూటింగులో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్లు కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నాక గత వారం చిన్న బ్రేక్ తీసుకుని దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి రాగానే మళ్లీ 'ఆర్ఆర్ఆర్' షూటింగులో పాల్గొని ఆ చిత్రాన్ని పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

ఇక 'ఆర్ఆర్ఆర్' పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.