Devineni Uma: లబ్ధిదారులకు గృహాలను మీరిస్తారా? వారినే స్వాధీనం చేసుకోమంటారా?: దేవినేని ఉమ హెచ్చరిక

  • టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో సముదాయాలు
  • గృహ ప్రవేశాలకు లబ్ధిదారులకు ఇప్పటికీ అనుమతి ఇవ్వని వైనం
  • స్వచ్ఛంద గృహప్రవేశాలకు లబ్ధిదారుల యత్నం
  • ఉచితంగా సంక్రాంతిలోపు కేటాయించాలని దేవినేని డిమాండ్
devineni uma slams jagan

టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో సముదాయాల్లో గృహ ప్రవేశాలకు లబ్ధిదారులకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బయలుదేరిన టీడీపీ, సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలను టీడీపీ నేత దేవినేని ఉమ పోస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన లబ్ధిదారులు స్వచ్ఛంద గృహప్రవేశాలకు ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. ఇప్పటికైనా టిడ్కో ఇళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించి, పూర్తిగా ఉచితంగా సంక్రాంతిలోపు కేటాయిస్తారా? లేదా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

‘పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు 21 లక్షల ఇళ్లను తెలుగు దేశం పార్టీ ప్రారంభించింది. పూర్తయిన 10 లక్షల ఇళ్లను 18 నెలలుగా ప్రభుత్వం పేదలకు కేటాయించకపోవడం దుర్మార్గం. సౌకర్యాలు కల్పించి టిడ్కో ఇళ్లను పూర్తి ఉచితంగా సంక్రాంతిలోపు కేటాయిస్తారా? లబ్ధిదారులనే తమ గృహాలను స్వాధీనం చేసుకోమంటారా?’ అంటూ దేవినేని ఉమ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

More Telugu News