పెళ్లి కుదిరింది పార్టీ ఇస్తానని పిలిచి.. యువతిపై సామూహిక అత్యాచారం

17-11-2020 Tue 08:08
  • ముంబైలోని ఓ హోటల్‌లో ఘటన
  • బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
Gang rape in mumbai hotel police searching for culprits

పెళ్లి కుదిరింది పార్టీ ఇస్తామని చెప్పి స్నేహితురాలిని హోటల్‌కు పిలిచిన యువకులు ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. అవినాశ్ పంగేకర్ (28), శిశిర్ (27), తేజస్ (25) స్నేహితులు. తనకు పెళ్లి కుదిరిందని, ఈ సందర్భంగా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి తన ఇద్దరు స్నేహితులతోపాటు మరో ముగ్గురు యువతులను అవినాశ్ గతవారం ఓ హోటల్‌కు ఆహ్వానించాడు.

పార్టీ అనంతరం ఇద్దరు యువతులు వెళ్లిపోగా, ఒక్క అమ్మాయిని మాత్రం ఉండమని చెప్పి మాటల్లో దించి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆమెపై అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడి హోటల్ నుంచి పరారయ్యారు. ఘటన జరిగినప్పటి నుంచి మౌనంగా ఉంటూ తనలో తానే కుమిలిపోతున్న బాధితురాలు, ఎట్టకేలకు తల్లిదండ్రులకు విషయం చెప్పి భారం దించుకునే ప్రయత్నం చేసింది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.