కొత్త పార్టీని స్థాపిస్తున్న కరుణానిధి కుమారుడు అళగిరి

16-11-2020 Mon 20:35
  • కేడీఎంకే పేరుతో పార్టీని స్థాపిస్తున్న అళగిరి
  • త్వరలో వెలువడనున్న అధికారిక ప్రకటన
  • ఈ నిర్ణయం వెనుక అమిత్ షా ఉన్నారని చర్చ
Alagiri to start new political party

త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ రాష్ట్రంలో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది. కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే అధినేత స్టాలిన్ సోదరుడు అళగిరి పార్టీని స్థాపించబోతున్నారు. కలైంగర్ డీఎంకే (కేడీఎంకే) పేరుతో పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతోంది. త్వరలోనే మధురైలో అళగిరి తన పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

మరోవైపు అళగిరి కొత్త పార్టీ నిర్ణయం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందనే చర్చ జరుగుతోంది. తమిళనాట పుంజుకోవాలనే యోచనలో ఉన్న బీజేపీ కనుసన్నల్లోనే అళగిరి పార్టీ పెట్టబోతున్నారని... ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెపుతున్నారు. మరోవైపు ఈ అంశం గురించి తనకు ఏమీ తెలియదని తమిళనాడు బీజేపీ చీఫ్ మురుగన్ చెప్పారు.