తిరుమల రానున్న రాష్ట్రపతి.. స్వాగతం పలకనున్న జగన్

16-11-2020 Mon 19:54
  • ఈ నెల 24న తిరుమల వస్తున్న రాష్ట్రపతి
  • అన్ని ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు
  • అదే రోజున ఢిల్లీకి తిరుగుపయనం కానున్న రాష్ట్రపతి
President Ram Nath Kovind coming to Tirumala for Balaji darshan

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుమలకు విచ్చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం సతీసమేతంగా ఆయన తిరుమలకు రానున్నారు. దర్శనానంతరం అదే రోజున ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లిపోనున్నారు. మరోవైపు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కూడా తిరుమలకు రానున్నారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి జగన్, టీటీడీ అధికారులు స్వాగతం పలకనున్నారు. అనంతరం వీరందరూ రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు.