అనుష్క చేతుల మీదుగా ఫిల్మ్ రిపబ్లిక్ స్టూడియో ప్రారంభం

16-11-2020 Mon 19:43
  • డిజిటల్ కంటెంట్ కోసం కొత్త స్టూడియో
  • స్టూడియోను స్థాపించిన ప్రణతి రెడ్డి
  • త్వరలో మరిన్ని వివరాలు
Anushka will inaugurates Film Republic Studio in TFI

టాలీవుడ్ లో మరో కొత్త స్టూడియో రంగప్రవేశం చేస్తోంది. ప్రణతిరెడ్డి స్థాపించిన ఈ ఫిల్మ్ రిపబ్లిక్ స్టూడియో ద్వారా నేటితరం డిజిటల్ కంటెంట్ రూపొందించనున్నారు. ఈ స్టూడియోను అగ్రశ్రేణి హీరోయిన్ అనుష్క ప్రారంభించనుంది. దీనిపై ప్రణతి రెడ్డి స్పందిస్తూ, తమ ప్రొడక్షన్ సంస్థ ద్వారా వచ్చే కంటెంట్ గతంలో ఎన్నడూ చూడని కొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టుకు మీ ఆశీస్సులు కావాలంటూ ప్రేక్షకులను కోరారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.