తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు

16-11-2020 Mon 18:37
  • పనబాక లక్ష్మి పేరును ప్రకటించిన చంద్రబాబు
  • గత ఎన్నికల్లో ఓడిపోయిన లక్ష్మి
  • లక్ష్మి గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ నేతలకు సూచన
Chandrababu announeces Panabaka Lakshmi name as Tirupati Bypolls TDP candidate

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఎంపిక చేసినట్టు పార్టీ నేతలకు ఆయన తెలిపారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పనబాక లక్ష్మి మళ్లీ బరిలోకి దిగుతున్నట్టు నేతలతో చంద్రబాబు చెప్పారు.

ఎన్నికలో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. పనబాక లక్ష్మి గెలుపు కోసం అందరూ కష్టించి పనిచేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో ఇప్పుడు ఉపఎన్నిక జరుగబోతోంది. ఇతర పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.