బీహార్ సంక్షేమం కోసం చేయగలిగినంత చేస్తాం: నితీశ్ కు ప్రధాని మోదీ భరోసా

16-11-2020 Mon 18:28
  • ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్
  • శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  • ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా పనిచేస్తుందని ఉద్ఘాటన
PM Modi gives assurance to Bihar CM Nitish Kumar

బీహార్ లో ఏడోసారి సీఎంగా పదవీప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి కూడా అభినందనలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. బీహార్ అభ్యున్నతి కోసం ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా పనిచేస్తుందని తెలిపారు. బీహార్ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం నుంచి చాతనైనంత సాయం చేస్తామని మోదీ ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ కు భరోసా ఇచ్చారు.

కాగా, ఇవాళ పాట్నాలో జరిగిన కార్యక్రమంలో నితీశ్ కుమార్ తో బీహార్ గవర్నర్ ప్రమాణం చేయించారు. నితీశ్ తో పాటు 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.