హైకోర్టు జడ్జిలపై అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు

16-11-2020 Mon 17:05
  • మొదట ఈ కేసును సీఐడీకి అప్పగించిన హైకోర్టు
  • 17 మందిపై కేసులు నమోదు చేసిన సీఐడీ
  • సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు అసంతృప్తి
  • సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు
CBI registers case in derogatory remarks on judges case

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు చేయడం పట్ల సీబీఐ కేసులు నమోదు చేసింది. న్యాయ వ్యవస్థలో తీవ్ర కలకలం రేపిన ఈ వ్యవహారాన్ని మొదట ఏపీ సీఐడీకి అప్పగించగా, హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ 17 మందిపై కేసులు నమోదు చేసింది. అయితే సీఐడీ విచారణ పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించాలంటూ సీబీఐని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ... సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. అనంతరం ఈ అంశానికి సంబంధించి విశాఖలో 12 కేసులను రిజిస్టర్ చేసింది.