'సామ్ జామ్' సమంతకు భారీ మొత్తంలో పారితోషికం!

16-11-2020 Mon 15:48
  • ఓటీటీ వేదికల వైపు బిజీ తారల మొగ్గు 
  • 'ఆహా' కోసం 'సామ్ జామ్' చేస్తున్న సమంత
  • ఒక్కో ఎపిసోడ్ కి 15 లక్షల పారితోషికం
  • తొలి ఎపిసోడ్ లో వచ్చిన విజయ్ దేవరకొండ  
Samantha gets huge amount for SamJam

ఇటీవలి కాలంలో థియేటర్లకు పోటీగా నిలుస్తున్న ఓటీటీ వేదికల వైపు మన బిజీ తారలు సైతం మొగ్గు చూపుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా పలువురు కథానాయికలు అటు సినిమాలు చేస్తూనే.. ఇటు ఓటీటీలకు టాక్ షోలు, వెబ్ సీరీస్ వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అందాలతార సమంత కూడా 'ఆహా' ఓటీటీకి ఓ టాక్ షో చేస్తోంది.

'సామ్ జామ్' పేరిట రూపొందుతున్న ఈ షోలోని మొదటి భాగంలో హీరో విజయ్ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చాడు. త్వరలో చిరంజీవి కూడా దీనికి హాజరుకానున్నారని, అలాగే అల్లు అర్జున్, రష్మిక, తమన్నా వంటి తారలు కూడా వస్తారని చెబుతున్నారు.

ఇక ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నందుకు సమంతకు పారితోషికం భారీగానే ముడుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కి 15 లక్షల చొప్పున మొత్తం పది ఎపిసోడ్లకు కోటిన్నర ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పారితోషికం పరంగా చూస్తే.. ఒక విధంగా ఇది సినిమాల లాగానే తారలకు వర్కౌట్ అవుతున్నట్టు చెబుతున్నారు.