నేను సైతం అంటూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటిన గంగవ్వ!

16-11-2020 Mon 15:35
  • స్వగ్రామంలో గంగవ్వ పర్యావరణ కార్యాచరణ
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న వైనం
  • అభినందించిన ఎంపీ సంతోష్
Famous youtuber and biggboss fame Gangavva plants saplings

మై విలేజ్ షో పేరిట యూట్యూబ్ లో సందడి చేసే గంగవ్వ బిగ్ బాస్ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ అభిమానులను సంపాదించుకుంది. తాజాగా గంగవ్వ తన సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించింది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నేను సైతం అంటూ పాలుపంచుకుంది. తన స్వగ్రామం లంబాడిపల్లెలో గంగవ్వ మొక్కలు నాటింది.

దీనిపై ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. ఈ తరానికి నువ్వు స్ఫూర్తిదాయకం గంగవ్వా అంటూ కొనియాడారు. "మీ ఊర్లో మొక్కలు నాటినందుకు కృతజ్ఞతలు. ఈ పర్యావరణ హిత కార్యాచరణ కోసం మీ మంచిమాటల పట్ల గర్విస్తున్నాను. మీ వీరాభిమానులు కూడా ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొంటారని ఆశిస్తున్నాను" అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.