లైఫ్ లో ఈమాత్రం "ఆహా" ఉండాలి: ఓటీటీ యాడ్ లో అల్లు అర్జున్

16-11-2020 Mon 13:32
  • ఆహా యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ
  • ఆహా కోసం యాడ్ లో నటించిన వైనం
  • సోషల్ మీడియాలో దూసుకుపోతున్న యాడ్
Allu Arjun promotes Aha OTT app

కొద్దికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన 'ఆహా' ఓటీటీ యాప్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. 'ఆహా'కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్ తాజాగా ఆ సంస్థ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.

ఇందులో బన్నీ ఓ అమ్మాయి కోసం వాళ్ల ఇంటికి వెళతాడు. ఆ అమ్మాయితో గదిలో ఉండగా వాళ్ల నాన్న (మురళీశర్మ) రావడంతో బన్నీ కప్ బోర్డులో దాక్కుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి సోదరుడు కూడా వచ్చి గదిలో చెక్ చేస్తాడు. కానీ బన్నీ కనిపించడు.

వాళ్లిద్దరూ వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి... "రాత్రంతా ఎలా కూర్చున్నావు బేబీ" అని అడుగుతుంది. అందుకు బన్నీ "ఆహా యాప్ లో కార్యక్రమాలు చూస్తూ గడిపేశాను" అని జవాబిస్తాడు. "లైఫ్  లో ఈ మాత్రం ఆహా ఉండాలి" అంటూ యాడ్ ను రక్తి కట్టించాడు. యాడ్ కాస్త వాడీవేడిగా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది.