నితీశ్ ప్రమాణస్వీకారానికి అమిత్‌షా, నడ్డా

16-11-2020 Mon 13:21
  • నేడు సీఎంగా ప్రమాణం చేయనున్న నితీశ్ కుమార్
  • బీజేపీకి చెందిన ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు 
  • తొలి విడతలో 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం
Amit Shah and JP Nadda to attend Nitish Kumars oath taking ceremony

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. బీజేపీకి చెందిన తారా కిషోర్ ప్రసాద్, రేణుదేవిలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి విడతలో 14 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నవారిలో జేడీయూ నుంచి విజేంద్ర యాదవ్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరి, మేవాలాల్ చౌదరి, షీలా మండల్ తదితరులు ఉండగా... బీజేపీ నుంచి మంగళ్ పాండే, రాంప్రీత్ పాశ్వాన్ తదితరులు ఉన్నారు. హిందుస్థాన్ అవామీ మోర్చా నుంచి సంతోశ్ మాంఝీ, వీఐపీ నుంచి ముఖేశ్ మల్లా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.