సీఎం జగన్ లేఖ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్

16-11-2020 Mon 13:10
  • సంచలనం సృష్టించిన సీఎం జగన్ లేఖ
  • ఇది కోర్టు ధిక్కరణ అంటూ జగన్ కు వ్యతిరేకంగా పిటిషన్లు
  • వాది, ప్రతివాదుల్లో ఒకరి తరఫున గతంలో వాదించానన్న లలిత్ కుమార్
Justice Lalit Kumar exits bench

ఏపీ సీఎం జగన్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాయడం, ఆ లేఖను మీడియాకు బహిర్గతం చేయడం తెలిసిందే. ఇది కచ్చితంగా న్యాయ ధిక్కరణ అంటూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. జగన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ ఆ పిటిషన్లలో కోరారు.

అయితే ఈ కోర్టు ధిక్కార పిటిషన్ల విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. ఈ పిటిషన్లపై విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ కుమార్ వైదొలిగారు. ఈ పిటిషన్లకు సంబంధించి వాది, ప్రతివాదుల్లో ఒకరి తరఫున తాను గతంలో వాదించానని, అందువల్ల తాను ఈ విచారణలో పాలుపంచుకోలేనని జస్టిస్ లలిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విచారణను చీఫ్ జస్టిస్ మరో ధర్మాసనానికి కేటాయిస్తారని వివరించారు.