అతను ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలోనే విజయం సాధించాడు: డొనాల్డ్ ట్రంప్

16-11-2020 Mon 08:28
  • రిగ్గింగ్ చేసి గెలిచాడని సెటైర్
  • ట్రంప్ ఓటమిని ఒప్పుకున్నారని లక్షలాది కామెంట్లు
  • తానేమీ అంగీకరించ లేదన్న ట్రంప్   
Trump Concedes Defete

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ఓటమిని దాదాపుగా అంగీకరించారు. వాషింగ్టన్ లో భారీ ర్యాలీ, ఆపై జరిగిన నిరసనల అనంతరం మాట్లాడిన ట్రంప్, "అతను గెలిచాడు. ఎందుకంటే, ఎన్నికల్లో వారు రిగ్గింగ్ కు పాల్పడ్డారు" అని అన్నారు. ట్రంప్ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారి. ఆపై 'ట్రంప్ కన్సీడెడ్' పేరిట ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అయింది. ట్రంప్ తన ఓటమిని ఒప్పుకున్నారని ఎంతో మంది కామెంట్లు పెట్టారు.

ఇవి వైరల్ అవుతూ ఉండటంతో ట్రంప్ స్పందించక తప్పలేదు. "అతను (బైడెన్) ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలోనే విజయం సాధించాడు. నేనేమీ అంగీకరించ లేదు. మనం ఎంతో పోరాడాల్సి వుంది. ఇవి రిగ్గింగ్ కాబడిన ఎన్నికలు" అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ మద్దతుదారులు నిన్న వాషింగ్టన్ లో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.