క్రికెట్ నైపుణ్యం ప్రదర్శించిన మంత్రి హరీశ్ రావు... వీడియో ఇదిగో!

15-11-2020 Sun 21:59
  • సిద్ధిపేటలో పోలీస్ జట్ల మధ్య టీ20 మ్యాచ్
  • మ్యాచ్ ను ప్రారంభించిన హరీశ్ రావు
  • బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఆకట్టుకున్న వైనం
Minister Harish Rao plays cricket

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేటలో తన క్రికెట్ ప్రతిభను ప్రదర్శించారు. బ్యాటింగ్, బౌలింగ్ లో తన నైపుణ్యం చూపించారు. సిద్ధిపేట మినీ స్టేడియంలో మెదక్ ఎస్పీ, సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు విచ్చేశారు.

టాస్ వేసిన అనంతరం హరీశ్ రావు సరదాగా కొద్దిసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. హరీశ్ రావు బ్యాటింగ్ చేస్తుండగా సిద్ధిపేట సీపీ జోయెల్ డేవిస్ బౌలింగ్ చేయడం విశేషం. అటు డిఫెన్స్ ఆడడమే కాకుండా, ముందుకొచ్చి భారీ షాట్లు కూడా ఆడారు. అంతేకాదు, బంతిని అందుకుని సీపీ జోయెల్ డేవిస్ కు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు.