దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ ప్రధాని ఇమ్రాన్ పై నెటిజన్ల విసుర్లు

15-11-2020 Sun 21:12
  • పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు
  • హ్యాపీ దివాలి అంటూ ట్వీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్
  • పాకిస్థాన్ లో హిందువులు ఎవరున్నారన్న నెటిజన్లు            
 People slams Pakistan PM Imran Khan Diwali wishes
పాకిస్థాన్ లో మైనారిటీ ప్రజలుగా హిందువులు పడుతున్న కష్టాలు మీడియా ద్వారా వెల్లడైనప్పుడల్లా భారత్ లో బలమైన స్పందనలు వినిపిస్తుంటాయి. తాజాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హిందూ సమాజానికి దీపావళి శుభాకాంక్షలు చెప్పినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి స్పందనలే వచ్చాయి. నిన్న దీపావళి సందర్భంగా మా హిందూ పౌరులందరికీ హ్యాపీ దివాలి అంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ధ్వజమెత్తారు.

హిందువులకు శుభాకాంక్షలు చెబుతున్నారు సరే, అసలింతకీ పాకిస్థాన్ లో ఎవరైనా హిందువులు మిగిలున్నారా? వాళ్లెప్పుడో మతమార్పిడికి గురయ్యుంటారని అనుకుంటున్నాను అని సోనియా సింగ్ అనే నెటిజన్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని చేసిన ట్వీట్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయో అంతమంది హిందువులు ఉండొచ్చంటూ మరో నెటిజన్ స్పందించారు. పాకిస్థాన్ లో మీరేం మిగిల్చారు గనుక! అంటూ ఎతిరాజన్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు.